ఇటీవల కోనసీమ జిల్లాకు ఏపీ ప్రభుత్వం అంబేద్కర్ పేరుపెట్టగా, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం తెలిసిందే. అమలాపురంలో మంత్రి పినిపె విశ్వరూప్, వైసీపీ ఎమ్మెల్యే సతీష్ బాబుల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో, కోనసీమ అల్లర్లపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు.
ఒక జిల్లాకు అంబేద్కర్ పేరుపెడితే దానిని కూడా రాజకీయం చేశారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అల్లర్లు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ఒక బీసీ మంత్రి ఇంటిపైనా, ఎస్సీ ఎమ్మెల్యే ఇంటిపైనా దాడి చేయించారని  ఆగ్రహం వెలిబుచ్చారు. తమ మంత్రివర్గంలో 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని సీఎం జగన్ వెల్లడించారు.
ఇవాళ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన విపక్షాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందానా అంటాడని విమర్శించారు. మోసం చేయడంలో చంద్రబాబు, దత్తపుత్రుడు తోడుదొంగలని అభివర్ణించారు. అటు, రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!