17న‌ మ‌హంకాళి అమ్మ‌వారి బోనాలు.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

హైద‌రాబాద్ : ఈ నెల 17 వ తేదీన నిర్వహించే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను క‌లిసి ఆహ్వాన ప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ట్రస్టీ కామేష్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!