హైదరాబాద్ లో కళాశాలకు వెళ్లి కనిపించకుండా పోయిన బీటెక్ విద్యార్థిని సాకిరెడ్డి వర్షిణి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ముంబైలో గుర్తించారు. మేడ్చల్ జిల్లా కండక్లోయలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన వర్షిణి.. పరీక్ష కోసం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాని విషయం ఆలస్యంగా వెలుగు చూడడం తెలిసిందే.
ఈ నెల 7న కళాశాలకు వెళ్లిన వర్షిణి ఐడీ కార్డు, మొబైల్ ఫోన్ మర్చిపోయాయని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చింది. కానీ, ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారు దర్యాప్తు ప్రారంభించగా, ముంబైలో ఆమె ఇన్ స్టా గ్రామ్ ఖాతాను యాక్సెస్ చేసినట్టు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.
ఎట్టకేలకు కల్యాణ్ ప్రాంత పోలీసులు వర్షిణిని గుర్తించి, పీఎస్ కు తరలించారు. డిప్రెషన్ వల్లే తాను ముంబైకి వెళ్లిపోయినట్టు ఆమె చెప్పింది. దీంతో ఆమెను అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!