100 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తున్న ‘సర్దార్’

  • అక్టోబర్ 21వ తేదీన వచ్చిన ‘సర్దార్’
  • కార్తి ద్విపాత్రాభినయం చేసిన సినిమా
  • రిలీజ్ రోజునే  వచ్చిన హిట్ టాక్
  • 10 రోజుల్లో 85 కోట్లకి పైగా వసూళ్లు
ఈ సారి దీపావళి పండుగ సందర్భంగా మూడు తెలుగు సినిమాలు బరిలోకి దిగాయి. అనువాద చిత్రమైన కార్తి ‘సర్దార్’ కూడా ఆ సినిమాలతో పాటే థియేటర్లకు వచ్చింది. అయితే ఆ మూడు సినిమాలకి మించి ‘సర్దార్’ వసూళ్లను రాబట్టడం విశేషం. అక్టోబర్ 21వ తేదీన తమిళంతో పాటే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తమిళంలో ప్రిన్స్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ వారు విడుదల చేశారు.

తండ్రి కొడుకులుగా కార్తి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా రజీషా విజయన్ – రాశి ఖన్నా నటించారు. యాక్షన్ సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్కును చూపిస్తూ వచ్చిన పీఎస్ మిత్రన్, ఈ సినిమాను తెరకెక్కించాడు. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 85 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టేసి, 100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.

ఈ సినిమాలో దేశభక్తుడైన తండ్రి పాత్రలోను .. నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ గాను కార్తి గొప్పగా నటించాడు. ఈ రెండు పాత్రలను మిత్రన్ డిజైన్ చేసిన తీరు బాగుంది. అలాగే ఈ రెండు పాత్రలకి సంబంధించిన యాక్షన్ ను ఓ పదేళ్ల పిల్లాడికి సంబంధించిన ఎమోషన్ కి కనెక్ట్ చేసిన తీరు బాగుంది. మొత్తానికి ఈ సినిమా కార్తి ఇంతకుముందు చేసిన ‘ఖాకీ’ .. ఖైదీ’ తరువాత స్థానంలో చేరిపోయిందనే చెప్పాలి.

Nationalist Voice

About Author

error: Content is protected !!