హైదరాబాద్ తాగునీటి కోసం సుంకిశాలలో ఇన్ టేక్ వెల్

  • రూ.1,453 కోట్లతో నిర్మాణం
  • శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
  • తాగునీటి సరఫరా వ్యవస్థ ఆధునికీకరణకు చర్యలు

హైదరాబాద్ కు తాగునీటిని సరఫరా చేయడం కోసం ఆ వ్యవస్థను సమూలంగా ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నాగార్జునసాగర్ కు సమీపంలోని సుంకిశాల వద్ద రూ.1,453 కోట్లతో హైదరాబాద్ మెట్రోవాటర్ అండ్ సివరేజ్ సర్వీసెస్ బోర్డు ఆధ్వర్యంలో ఇన్ టేక్ వెల్ ను నిర్మిస్తున్నారు.

ఇవాళ దానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, జల మండలి అధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!