హైదరాబాద్‌లో నేడు 34 MMTS సర్వీసులు రద్దు

ఇటీవల భారీ వర్షాల కారణంగా రద్దీ బాగా తగ్గిపోవడంతో హైదరాబాద్ లోకల్ ట్రైన్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే తరచూ తగ్గిస్తూ వస్తోంది. ఈ ఆదివారం (జూలై 31) కూడా 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీస్ రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 9 ఎంఎంటీఎస్ రైళ్లు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7ఎంఎంటీఎస్ రైళ్లు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 ఎంఎంటీఎస్ రైళ్లు, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గాల్లో ఒక్కో ఎంఎంటీస్ రైలును రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

రద్దయిన రైళ్ల వివరాలు: 

సికింద్రాబాద్-లింగంపల్లి : 47150 ఎంఎంటీస్ సర్వీస్ రద్దు

లింగంపల్లి-సికింద్రాబాద్‌ : 47195 ఎంఎంటీస్ సర్వీస్ రద్దు 

ఫలక్ నూమా-లింగంపల్లి  : 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170

లింగంపల్లి-ఫలక్ నూమా : 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192

లింగంపల్లి-హైదరాబాద్ : 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140

హైదరాబాద్-లింగంపల్లి : 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120

ఎంఎంటీస్ రైళ్ల రద్దును గమనించి సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే ఎంఎంటీఎస్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఆదివారం ఈ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించేవారు ప్రత్యామ్నాయం చూసుకోవాలి.

Nationalist Voice

About Author

error: Content is protected !!