హైదరాబాద్‌లో టపాసులు పేలుస్తూ గాయపడిన 24 మంది.. ఐదుగురి పరిస్థితి విషమం

  • దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు
  •   గాయపడిన వారిలో ఎక్కువమంది చిన్నారులే
  • ఎక్కువమందిలో కంటి సంబంధిత సమస్యలు
  • ముగ్గురిని వేరే ఆసుపత్రులకు రెఫర్ చేసిన వైద్యులు
దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగింది. చిన్నాపెద్దా టపాసులు కాస్తూ పండుగను జరుపుకున్నారు. గ్రహణం కారణంగా మంగళవారం జరుపుకోవాల్సిన పండుగను దేశప్రజలు నిన్ననే జరుపుకున్నారు. అయితే, ఎప్పటిలానే ఈసారి కూడా బాణాసంచా కాలుస్తూ పలువురు గాయపడ్డారు. ఒక్క హైదరాబాద్‌లోనే 24 మంది గాయపడగా వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

గాయపడి వారిలో ఎక్కువమంది కంటి సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరందరూ నగరంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు. చికిత్స కోసం వచ్చిన వారిలో ఎక్కువమంది చిన్నారులేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో 12 మంది చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అలాగే, గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ముగ్గురిని వేరే ఆసుపత్రులకు రెఫర్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Nationalist Voice

About Author

error: Content is protected !!