హైద‌రాబాద్‌లో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి…

హైద‌రాబాద్ : హైటెక్ సిటీ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను వ‌న‌ప‌ర్తికి చెందిన రాజ‌ప్ప‌, శ్రీను, కృష్ణ‌గా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఒక‌రి వ‌ద్ద మ‌ద్యం సీసాలు ఉన్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు.మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో రైల్వేస్టేష‌న్‌కు స‌మీపంలోని మూల‌మ‌లుపులో ప‌ట్టాలు దాటుతుండ‌గా.. ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్‌బాడీస్‌ను ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!