హైదరాబాదులో మోదీ ఫ్లెక్సీలు కనిపించకూడదని కేసీఆర్ కుట్ర పన్నారు: ఈటల

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో నగరంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చోటుచేసుకున్న ఫ్లెక్సీల రగడపై స్పందించారు. హైదరాబాదులో ప్రధాని మోదీ ఫ్లెక్సీలు కనిపించకూడదని కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు. మోదీ ఫొటో ఫ్లెక్సీలపై లేకున్నా, ఆయన దేశ ప్రజల గుండెల్లో ఉన్నారని ఈటల పేర్కొన్నారు.
ఎస్సీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోదీ సొంతమని అన్నారు. ఇప్పుడు ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేయాలని నిర్ణయించారని వ్యాఖ్యానించారు. కానీ ఎస్సీ వ్యక్తిని సీఎం చేస్తానని మాట తప్పిన వ్యక్తి కేసీఆర్ అని ఈటల విమర్శించారు. ఎస్సీ నేతకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి కొన్నాళ్లకే తప్పించారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!