హత్య కేసును ఛేదించిన పోలీసులు. మైనర్లే నిందితులు..

నేషనలిస్ట్ వాయిస్, మే 19, షాద్ నగర్ :  రంగారెడ్డి జిల్లా కొత్తూర్ పోలీస్టేషన్ పరిధిలో ఈ నెల 9 వ తేది  రాత్రి 11 గంటల సమయంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను వారు మీడియాకు వివరించారు. కొత్తూరు లోని అండర్ పాస్ కింద బీహార్ కు చెందిన దిలీప్ అనే వ్యక్తిని బాండ రాయితో తలపై కొట్టి ధారుణంగా హతమార్చారు. అనంతరం హతుడి జేబులో ఉన్న 11000 రూపాయలు తీసుకుని పారిపోయారు. కాగా మరుసటి రోజు కొత్తూరు లో ఒక బైకు చోరీకి గురయ్యింది. బైకు చోరీ కేసులో సీసి టీవీలు పరిశీలించిన పోలీసులు బైకు చోరీ చేసిన అభిషేక్ ను కొత్తూరు రైల్వే స్టేషన్ లో పట్టుకున్నారు. అభిషేక్ ను పోలీసులు విచారించగా హత్య కేసు కూడా బయట పడింది. ఈ హత్యలో తాహెర్ మరియు అభిషేక్ ఇద్దరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు శంషాబాద్ లోని ఒక కాలేజి లో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!