స్నేహితుడి వంచన… మందు కొట్టి మరీ రూ. 75 లక్షలు చోరీ

మలక్‌పేట: అర్థరాత్రి వరకు కలిసి మద్యం తాగి స్నేహితుని ఇంట్లో రూ. 75 లక్షల నగదు దోచుకెళ్లాడు ఓవ్యక్తి. ఈ సంఘటన శనివారం మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సాయిప్రకాశ్‌రెడ్డి మూసారంబాగ్‌ డివిజన్‌ సలీంనగర్‌ పద్మావతి రెసిడెన్సీలో ఉంటున్నాడు.  గోవాలో ఉంటున్న అతని ఫ్రెండ్‌ ఫిరోజ్‌ ఈనెల 29న సలీంనగర్‌కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఇంట్లో మద్యం సేవించారు. తరువాత ఫిరోజ్‌ పబ్‌కి వెళ్దామని అంటే రాత్రి 10 గంటలకు కొత్తపేటలోని ఓ పబ్‌కి వెళ్ళారు. పబ్‌లో పాత ఫ్రెండ్‌ రాజేష్‌ కలిశాడు.

రాత్రి 1.30 గంటలకు సాయిప్రకాశ్‌రెడ్డి, ఫిరోజ్, రాజేష్‌, రాజేష్‌ స్నేహితుడు నలుగురు కలిసి మద్యం తాగడానికి సలీంనగర్‌కు వచ్చారు. ఫిరోజ్‌ ఒక గదిలో పడుకున్నాడు. మిగిలిన ముగ్గురూ కలిసి హాల్లో మద్యం తాగుతుండగా.. రాజేష్‌ నిద్రవస్తుందని చెబితే సాయిప్రకాశ్‌రెడ్డి అతనిని మరొగదిలోకి తీసుకెళ్లి పడుకోమని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. వాష్‌ రూమ్‌ నుంచి బయటికి వచ్చేసరికి మంచంపై ఖాళీ బ్యాగు పడి ఉండటాన్ని గమనించాడు.

రాజేష్‌, అతని ఫ్రెండ్‌ ఇంట్లో లేరు. ఇంట్లో పెట్టిన రూ. 75 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ కన్పించలేదు. వెంటనే కిందకి వెళ్లి చూడగా రాజేష్‌ కనిపించాడు. అతన్ని ఆపి అడుగుతుండగా గేట్‌ దూకిపారిపోయాడు. భూమి అమ్మిన రూ.75 లక్షలు నల్లరంగు బ్యాగులో ఉండగా రాజేష​ రాజేష్‌ ఫ్రెండ్‌ దొంగతనం చేశారని బాధితుడు సాయిప్రకాశ్‌రెడ్డి శనివారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.  

Nationalist Voice

About Author

error: Content is protected !!