స్కూల్ టీచర్ గా రోబోలు.. హైదరాబాద్ లో ప్రైవేటు స్కూల్ కొత్త ప్రయోగం

ఫ్యాక్టరీల్లో రోబోలను వినియోగించడం తెలుసు. కానీ, పాఠాలు బోధించడంలో సాయపడే రోబోలు ఉంటాయని తెలుసా..? హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కు వెళితే తరగతి గదిలో రోబోలు పలకరిస్తాయి. పక్కన టీచర్ కూడా ఉంటారు. విద్యార్థులు అడిగే సందేహాలను రోబో తీరుస్తుంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ) సాయంతో ఈ రోబోలు టీచర్ పాత్రను నిర్వహిస్తున్నాయి. పాఠశాలలో రోబో టీచర్ ప్రవేశపెట్టడం అన్నది దేశంలోనే తొలిసారిగా ఈ స్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఈగల్ రోబోల గురించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం వివరించడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఉన్న మూడు విద్యా కేంద్రాల్లోనూ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రోబోలను రంగంలోకి దింపింది.
ఐదు నుంచి 11వ తరగతులకు ఈ రోబోలు పాఠాలు కూడా చెబుతాయి. 30కు పైగా భాషల్లో పాఠాలు బోధించగలవు. విద్యార్థుల సందేహాలు తీర్చగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్ టాప్ ల నుంచి యాక్సెస్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!