సైబర్‌ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం…

కాచిగూడ,జూలై 22 : యువతీ యువకులకు ఉపాధి కల్పించడానికి నేషనల్‌ అకాడమీ ఆప్‌ సైబర్‌ సెక్యూరిటీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో ఎగ్జామ్‌  నిర్వహించనున్నది. ఇందులో సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్స్‌, ఎథికల్‌ హాకింగ్‌ కోర్సులు, డిప్లొమా ఇన్‌ సైబర్‌ మేనేజ్‌మెంట్‌, పోస్ట్‌ డిస్లొమా ఇన్‌ సైబర్‌ మేనేజ్‌మెంట్‌కు ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ విమలారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్‌ సెక్యూరిటీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాలలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఐటీ రంగం, ఇన్‌ఫర్‌మేషన్‌ అనలిస్ట్‌, పెనైట్రేషన్‌ టెస్టర్‌, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌, ఐటీ సెక్యూరిటీ ఇంజినీర్‌ తదితర విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

ఆసక్తి గల యువతీయువకులు ఆగష్టు 5వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె కోరారు. వివరాలకు 7893141797, ఆన్‌లైన్‌లో www.nacsindia.org లో  సంప్రదించవచ్చని ఆమె సూచించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!