సైనిక స్కూళ్లలో ప్రవేశాలు

  • నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
  • 2023-24 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశం
  • దేశవ్యాప్తంగా 33 స్కూళ్లలో మొత్తం 4786 సీట్లు
  • దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 30
కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడిచే సైనిక స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023) విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరంలో ఆరో తరగతితో పాటు తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి, అందులో అర్హత సాధించిన వాళ్లకు అడ్మిషన్ అందజేస్తుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూళ్లలోని 4786 సీట్లను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది.

అర్హతలివే..
ఆరో తరగతిలో సీటు కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2023 మార్చి 31 నాటికి 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉండాలి. తొమ్మిదో తరగతి విద్యార్థులకు 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి. 2022-23 విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతిలో పాస్ అయి ఉండాలి.

దరఖాస్తు చేసుకోవడం ఇలా..
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ విద్యార్థులు రూ.650, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు రూ.500 లు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ..
2022 నవంబర్ 30

ప్రవేశ పరీక్ష జరిగేది..
2023 జనవరి 8న దేశవ్యాప్తంగా దాదాపు 180 కేంద్రాల్లో ఆఫ్ లైన్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ..
అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.

ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు..
ఆరు, తొమ్మిదో తరగతులకు సంబంధించి అన్ని కేంద్రాల్లో కలిపి 4786 సీట్లు ఉన్నాయి. ఇందులో ఆరో తరగతిలో 4,404 సీట్లు ఉండగా.. అందులో ప్రభుత్వ సీట్లు 2,894, ప్రైవేటు 1,510 చొప్పున ఉన్నాయి. ఇక తొమ్మిదో తరగతిలో 382 సీట్లు ఉన్నాయి.

సీట్ల కేటాయింపు ఇలా..
సైనిక్ స్కూలు ఉన్న రాష్ట్రంలో స్థానిక(ఆ రాష్ట్రానికి చెందిన) విద్యార్థులకు మొత్తం సీట్లలో 67 శాతం రిజర్వ్ చేస్తారు. మొత్తం సీట్లలో ఎస్సీ కేటగిరికి 15% ఎస్టీ కేటగిరికీ 7.5%, ఇతరులకు 27% సీట్లు కేటాయిస్తారు. మిగతా 50.50% సీట్లలో 25% రక్షణ శాఖ మాజీ ఉద్యోగులకు 25% ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!