సెక్యూరిటీ గార్డులు, స్వీప‌ర్లే వైద్యులా?: లెక్చరర్ రామకృష్ణ మృతిపై నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆగ్ర‌హం

  • అంతులేని నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారన్న నాదెండ్ల‌
  • ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారని విమ‌ర్శ‌
  • ఆరోగ్య శాఖ‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త‌ జ‌గ‌న్ దేన‌ని వ్యాఖ్య‌
ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందించ‌డంలో అంతులేని నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని ఏపీ స‌ర్కారుపై జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. యాక్సిడెంట్‌లో గాయపడి స‌రైన వైద్యం అంద‌క లెక్చరర్ రామకృష్ణ మృతి చెందిన‌ ఘ‌ట‌న‌పై నాదెండ్ల మ‌నోహ‌ర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో ఏపీ స‌ర్కారు తీరుపై మండిప‌డ్డారు. సెక్యూరిటీ గార్డులు, స్వీప‌ర్లే వైద్యులా? అని ఆయ‌న నిల‌దీశారు. వైద్య ఆరోగ్య శాఖ‌ను నిర్వీర్యం చేసిన ఘ‌ట‌న జ‌గ‌న్ దేన‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకీ వైద్య సేవ‌లు దిగ‌జారుతుండ‌డం వైసీపీ స‌ర్కారు వైఫ‌ల్యాన్ని సూచిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!