స‌ల్మాన్‌ఖాన్‌కు బెదిరింపు లేఖ : ఆయుధ‌ లైసెన్స్ కోరిన బాలీవుడ్‌ కండ‌ల‌వీరుడు!

ముంబై : బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త కోసం ఆయుధ లైసెన్స్ కోరుతూ బాలీవుడ్ కండ‌లవీరుడు ముంబై పోలీసుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. స‌ల్మాన్ ఖాన్‌తో పాటు ఆయ‌న తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామ‌ని గ‌త నెల‌లో బెదిరింపు లేఖ వ‌చ్చిన నేప‌ధ్యంలో బాలీవుడ్ న‌టుడు వెప‌న్ లైసెన్స్‌కు ద‌ర‌ఖాస్తు చేశారు.

ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ వివేక్ ఫ‌న్స‌ల్క‌ర్‌ను శుక్ర‌వారం క‌లిసిన స‌ల్మాన్ గ‌త నెల‌లో త‌న‌కు, త‌న తండ్రికి ప్రాణ హాని క‌ల్పిస్తామ‌ని త‌మ బాంద్రా నివాసానికి వ‌చ్చిన బెదిరింపు లేఖ గురించి వివ‌రించారు. ఎలాంటి సంత‌కం లేని ఆ బెదిరింపు లేఖ‌లో మూసేవాలా లాగా మిమ్మ‌ల్ని అంత‌మొందిస్తామ‌ని రాసిఉంది. జూన్ 5న బెదిరింపు లేఖ వ‌చ్చిన అనంత‌రం స‌ల్మాన్ ఖాన్‌కు భ‌ద్ర‌త‌ను పెంచారు. ఈ వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన ముంబై పోలీసులు ఇది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌చార ఎత్తుగ‌డ‌గా తేల్చారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!