శ్రీశైలం దేవాలయం వంటగదిలో బాయిలర్ పేలుడు

  • పెద్ద శబ్దంతో పేలిన స్టీమ్ వాటర్ బాయిలర్
  • భయంతో పరుగులు తీసిన భక్తులు, ఆలయ సిబ్బంది
  • అన్నదానం బయటివైపు ఘటన.. తప్పిన ప్రమాదం
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం వంటగదిలో మంగళవారంనాడు బాయిలర్ పేలింది. దేవస్థానంలోని అన్నపూర్ణ భవన్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ తయారీకి ఉపయోగించే వంటగదిలోని స్టీమ్ వాటర్ బాయిలర్ పేలింది. పెద్ద శబ్దంతో పేలుడు చోటుచేసుకోవడంతో అక్కడున్న ఆలయ సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. నిత్య అన్నదానం బయటవైపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. బాయిలర్ పేలుడుకు కారణలేంటని పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయంలోని కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ మొదలయింది. దీంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న వారికి వేడి పాలు, ప్రసాదం అందించారు. వీటి ఏర్పాట్లకు ఉపయోగించే వంటగదిలోనే మంగళవారం ఉదయం పేలుడు చోటుచేసుకుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!