శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేస్తాం : ఈవో ధర్మారెడ్డి

ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాలలో నిర్వహిస్తూన్నామని తెలిపారు. దేవాదాయ శాఖ, టీటీడీ, ఆలయ కమిటీలు, సమరసత్తా స్వచ్ఛంద సంస్థ ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలు చేస్తూన్నామని చెప్పారు.

Tirumala EO Darmareddy : శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేస్తాం : ఈవో ధర్మారెడ్డి
తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల అదనపు కోటా విడుదల చేస్తామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆగస్టు, సెప్టంబర్ నెలకు సంభందించి రోజుకి 4 వేల చొప్పున అదనపు టిక్కెట్లు విడుదల చేస్తామని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు ఆలయ నిర్మాణాలను కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నామని అసంభద్దమైన ఆరోపణ చేశారని ఈవో దర్మారెడ్డి పేర్కొన్నారు.

ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాలలో నిర్వహిస్తూన్నామని తెలిపారు. దేవాదాయ శాఖ, టీటీడీ, ఆలయ కమిటీలు, సమరసత్తా స్వచ్ఛంద సంస్థ ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలు చేస్తూన్నామని చెప్పారు. పార్వేటి మండపం శిథిలావస్థకు చేరుకోవడంతోనే జీర్ణోద్దారణ చేస్తూన్నామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!