శబరిమల ఆలయంలో సంచలన ప్రవేశం.. స్వామిని దర్శించుకున్న ట్రాన్స్ జెండర్

య్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు విధిగా శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం సాధారణమే. అయ్యప్ప స్వామి దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున స్వాములు శబరిమలకు తరలి వస్తుంటారు. దీంతో శబరిమల ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. శతాబ్దాల నుంచి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు గుడిలోకి ప్రవేశించకూడదనే ఆచారం కొనసాగుతోంది. అయితే ఈసారి శబరిమల ఆలయంలో  సంచలనం చోటు చేసుకుంది. 

కేరళ రాష్ట్రంలోని శబరిమల గిరుల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల. ఇక్కడ కొలువైన దేవుడు.. అయ్యప్పను హిందువులు హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని స్వాముల విశ్వాసం. ప్రతి ఏటా నవంబర్ మాసంలో అయ్యప్ప దీక్ష మాలను ధరించి సంక్రాంతి సమయంలో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్పను ‘‘ఆ జన్మ బ్రహ్మచారిగా’’ పేర్కొంటూ, శతాబ్దాల నుంచి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న రుతుచక్రం కొనసాగే మహిళలు గుడిలోకి అడుగు పెట్టకూడదనే ఆచారం కొనసాగుతోంది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం పై 2019లో పెద్ద రచ్చే జరిగింది. ఈ వివాదం అటు ఉంచితే తాజాగా శబరిమల ఆలయంలో సంచలనం చోటుచేసుకుంది. కేరళ చరిత్రలో ఓ ట్రాన్స్‌ జెండర్‌ తొలిసారి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు.

 ట్రాన్స్ జెండర్ జోగిని నిషా క్రాంతి ఆదివారం ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకుంది. ట్రాన్స్‌ జెండర్‌ ఐడీ ఆధారంగా ఆమెకు కేరళ ప్రభుత్వం దర్శనానికి అనుమతిచ్చింది. దీంతో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ దర్శించుకున్న ఘటన చోటు చేసుకుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!