‘వ్యూహం’ గురించి తనదైన శైలిలో వివరించిన రాంగోపాల్ వర్మ

  • మ్యాథమ్యాటిక్స్ సూత్రాన్ని పోస్ట్ చేసిన వర్మ
  • తన కొత్త సినిమా ఫార్మూలా ఇదేనంటూ హింట్
  • ఏపీ రాజకీయాలపైనే తన సినిమా అంటూ క్లారిటీ
‘వ్యూహం’ పేరిట తానో రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా తీయనున్నట్లు దర్శకుడు రాంగోపాల్ వర్మ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం తాడేపల్లి వెళ్లి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన వర్మ… ఆ మరునాడే తన నూతన సినిమా గురించి ప్రకటించారు. ‘వ్యూహం’ పేరిట తాను తీయబోయే సినిమా బయో పిక్ కాదని, రియల్ పిక్ అని… రియల్ పిక్ లో అన్నీ నిజాలే ఉంటాయంటూ ఆయన ప్రకటించారు. ఈ ప్రకటనపై గురువారం పెద్ద చర్చ నడిచిన సంగతి తెలిసిందే.

తాజాగా తన ‘వ్యూహం’ సినిమా గురించి వివరించే యత్నం చేసిన వర్మ…. అందుకోసం గణితాన్ని ఎంచుకున్నారు. మ్యాథమ్యాటిక్స్ లో ప్లస్, మైనస్, డివైడెడ్ బై, ఇంటూ అంటూ గుర్తులను వాడుకుంటూ ఆయన తన సినిమాపై ఓ ఫజిల్ లాంటి సూత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ”బీజేపీ ÷ పీకే  x సీబీఎన్ – లోకేశ్ ప్లస్ జగన్ = వ్యూహం” సూత్రాన్ని పోస్ట్ చేసిన వర్మ… దీని అర్థమేమిటన్నది జనాలకే వదిలేశారు. మొత్తంగా తాను తీస్తున్నది ఏపీ రాజకీయాలకు చెందిన సినిమానేనని వర్మ చెప్పకనే చెప్పేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!