వైఎస్ఆర్ బీమా పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్ట్

  • కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలే టార్గెట్
  • బీమా వస్తుందంటూ మోసాలు
  • ఏడాది కాలంగా ఢిల్లీ కేంద్రంగా మోసాలు
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైఎస్ఆర్ బీమా పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు బీమా పరిహారం వస్తుందంటూ ఈ ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.

ఈ ముఠా గత ఏడాదిగా ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న విషయం వెల్లడైంది. ఈ ముఠాలో నేపాల్ కు చెందిన వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా, ఇప్పటిదాకా నలుగురిని అరెస్ట్ చేశారు.

నిందితుల నుంచి రూ.3.29 లక్షల నగదుతో పాటు 73 ఏటీఎం కార్డులు, 18 మొబైల్ ఫోన్లు, 290 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!