వెస్టిండీస్‌తో మూడో వ‌న్డే… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

  • ట్రినిడాడ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌
  • తొలి రెండు వ‌న్డేల్లో విజ‌యంతో సిరీస్ కైవ‌సం చేసుకున్న టీమిండియా
  • మూడో విజ‌యంతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే దిశ‌గా భార‌త జ‌ట్టు
  • ఒక్క విజ‌యంతో అయినా ప‌రువు నిలుపుకోవాల‌ని భావిస్తున్న వెస్టిండీస్‌
వెస్టిండీస్ టూర్‌లో ఉన్న టీమిండియా ఆతిథ్య జ‌ట్టుతో మ‌రికాసేప‌ట్లో మూడో వ‌న్డే ఆడ‌నుంది. ట్రినిడాడ్ వేదిక‌గా ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో ఇప్ప‌టికే తొలి రెండు వ‌న్డేల్లో విజ‌యం సాధించిన టీమిండియా ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను హ‌స్త‌గ‌తం చేసుకుంది. తాజా మ్యాచ్‌లో విజ‌యం ద్వారా ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా య‌త్నిస్తుండ‌గా… క‌నీసం ఈ మ్యాచ్‌లో అయినా విజ‌యం ద‌క్కించుకుని ప‌రువు కాపాడుకునే దిశ‌గా ఆతిథ్య జ‌ట్టు య‌త్నిస్తోంది.
Nationalist Voice

About Author

error: Content is protected !!