విశాఖ మిస్సింగ్ కేసు లో ట్విస్ట్, కోటి రూపాయల ప్రజాధనం వృధా

విశాఖ పట్నం ఆర్కే బీచ్ లో 21 ఏళ్ల వివాహిత మిస్సింగ్ కేసు లో సినిమాటిక్ ట్విస్ట్ వెలుగు లో కి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం కి చెందిన సాయి ప్రియ అనే యువతి కి శ్రీనివాస్ తో పెళ్లయింది. తమ పెళ్లిరోజు సందర్భంగా తనను బీచ్ కి తీసుకెళ్లాలని కోరడంతో భర్త శ్రీనివాస్ ఆమె ను తీసుకుని బీచ్ కి వెళ్లారు. అక్కడ కాసేపు నీటిలో సరదాగా సమయం గడిపిన తర్వాత ఉన్నట్లుండి సాయి ప్రియ కనిపించకపోవడంతో కంగారు పడ్డ భర్త పరిసర ప్రాంతాల్లో వెతికిన తర్వాత , ఎక్కడా కనిపించకపోవడంతో సముద్రంలో గల్లంతయిందేమో అని భావించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. బహుశా సెల్ఫీ తీసుకుంటూ ఉండగా సముద్రంలో పడిపోయి ఉంటుందని పోలీసులు కూడా భావించారు. దీంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో సముద్రమంతా జల్లించారు.

ఎక్కడా జాడ కనిపించకపోవడంతో హెలికాప్టర్ ని సైతం రంగంలోకి దించారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన సినిమాటిక్ ట్విస్ట్ మొత్తం సంఘటనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మార్చివేసింది. సాయి ప్రియ అనే ఈ వివాహిత కి రవి అని వేరే ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని, ఆయనతో కలిసి జీవించడం కోసం బీచ్ లో ఉన్నప్పుడు భర్త కళ్ళు కప్పి జారుకుందని, ప్రియుడితో కలిసి నెల్లూరులో ఉన్నట్లు తల్లిదండ్రులు పోలీసులతో నిర్ధారించారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే సుమారు కోటి రూపాయల దాకా వ్యయం చేసి ఏర్పాటుచేసిన సెర్చ్ ఆపరేషన్లకు నేవీ వర్గాలు ముగింపు పలికాయి. ఏది ఏమైనా ఈ సంఘటన ప్రస్తుత సమాజ పోకడలకు ఉదాహరణగా నిలుస్తోంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!