విజయనగరం జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీ

నేషనలిస్ట్ వాయిస్, మే 19, విజయనగరం :  ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం ఆమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో అంగన్వాడీ టీచర్లు 10 ఖాళీలు, అంగన్ వాడీ హెల్పర్లు 73, మినీ అంగన్ వాడీ హెల్పర్లు 3 ఖాళీలు ఉన్నాయి. మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధినుల అర్హతల విషయానికి వస్తే పదవతరగతి పూర్తి చేసి ఉండాలి. పోస్టు ఖాళీగా ఉన్న గ్రామానికి చెందిన వారై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 21 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; శిశు అభివృద్ధి పధకపు అధికారిణి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://vizianagaram.ap.gov.in/ పరిశీలించగలరు.

Nationalist Voice

About Author

error: Content is protected !!