‘వారసుడు’ నుంచి వదిలిన లేటెస్ట్ స్టిల్స్ ఇవే!

  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారసుడు’
  • విజయ్ సరసన నాయికగా రష్మిక
  • సంగీత దర్శకత్వం వహించిన తమన్
  • తెలుగు .. తమిళ భాషల్లో సంక్రాంతికి రిలీజ్
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, తమిళంలోను విడుదల కానుంది. తమిళంలో ఈ సినిమాకి ‘వరిసు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘మహర్షి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత వంశీ పైడిపల్లి చేస్తున్న సినిమా కావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని స్టిల్స్ ను వదిలారు. విజయ్ అభిమానులను ఆకట్టుకునేలా ఈ స్టిల్స్ ఉన్నాయి. విజయ్ జోడీగా రష్మిక అలరించనున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. ప్రభు .. శ్రీకాంత్ .. ఖుష్బూ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
వరుస విజయాల తరువాత విజయ్ చేస్తున్న సినిమా ఇది. తెలుగు .. తమిళ భాషల్లో సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసమే విజయ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత, తనకి ‘మాస్టర్’ తో హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ తో విజయ్ సినిమా ఉండనుందనే సంగతి తెలిసిందే.
Nationalist Voice

About Author

error: Content is protected !!