లైలా గ్లామర్ మరింత పెరిగిందే!

  • 90లలో హీరోయిన్ గా మెరిసిన ‘లైలా’
  • 16 ఏళ్ల తరువాత ‘సర్దార్’తో రీ ఎంట్రీ
  • సమీర పాత్రలో మెప్పించిన లైలా
  • హాట్ టాపిక్ గా మారిన ఆమె గ్లామర్
లైలా పేరు వినగానే ‘ఎగిరే పావురమా’ సినిమా కళ్లముందు కదలాడుతుంది. ఎప్పుడు చూసినా ఆమె నవ్వుతూనే కనిపిస్తూ ఉంటుంది. నవ్వే సమయంలో ఆమె కళ్లు మూసుకోవడం ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా మారిపోయి, యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. గ్లామర్ పరంగా ఆమెకి దక్కిన మార్కులు కూడా ఎక్కువే. ఇక ఈ పిల్ల టాలీవుడ్ ను దున్నేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆమె ఆ స్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టలేదు.

ఇండస్ట్రీలో పదేళ్లపాటు ఉన్న లైలా తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లోను చేసింది. అయితే ఈ సమయంలో ఇన్ని భాషల్లోను ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువనే. పెళ్లి తరువాత ఆమె నటనకు దూరంగా ఉంటూ వచ్చింది. 16 ఏళ్ల తరువాత ఆమె ‘సర్దార్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె ‘సర్దార్’ ఆశయం కోసం పోరాడే పాత్రలో పదేళ్ల పిల్లాడికి తల్లిగా కనిపిస్తుంది.

సమీర పాత్రలో లైలా చాలా డీసెంట్ గా యాక్ట్ చేసింది. ఆమెలో మునుపటి గ్లామర్ ఎంత మాత్రం తగ్గకపోగా .. మరింత గ్లామర్ గా కనిపించడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకాలం తరువాత ఆమె ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం లైలాకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం. ఇక తెలుగులోను లైలా నటిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Nationalist Voice

About Author

error: Content is protected !!