రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన రాహుల్ గాంధీ…

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిన్న తన నియోజకవర్గం వయనాడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని సకాలంలో ఆదుకున్నారు. నియోజకవర్గంలో పర్యటన ముగించుకుని తాను బస చేసిన హోటల్ కు వెళుతుండగా, మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగడాన్ని రాహుల్ గాంధీ గమనించారు. ఓ వ్యక్తిని బైక్ ఢీకొట్టగా, ఆ వ్యక్తికి గాయాలయ్యాయి.
వెంటనే తన వాహనం నుంచి దిగిన రాహుల్ గాంధీ బాధితుడి పరిస్థితిని అంచనా వేశారు. వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న అంబులెన్స్ ను రప్పించి ఆ క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు చొరవ తీసుకున్నారు. బాధితుడికి ప్రథమచికిత్స చేసిన అనంతరం ఆ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా రాహుల్ మానవతా దృక్పథంపై నెటిజన్ల నుంచి అభినందల జల్లు కురుస్తోంది.
Nationalist Voice

About Author

error: Content is protected !!