రైట‌ర్‌గా మారిన కేంద్ర హోం మంత్రి!… ఈనాడు ఎడిటోరియ‌ల్‌లో అమిత్ షా వ్యాసం

బీజేపీ కీల‌క నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ‌కీయ నేత‌గా కొన‌సాగుతూనే తాజాగా రైటర్ అవ‌తారం కూడా ఎత్తారు. ప్ర‌ముఖ తెలుగు దిన‌ప‌త్రిక ఈనాడులో ఆయ‌న ఓ వ్యాసం రాశారు. స‌ద‌రు వ్యాసాన్ని ఈనాడు ప‌త్రిక సోమ‌వారం నాటి త‌న సంచిక‌లో ప్ర‌చురించింది. ఎడిటోరియ‌ల్ పేజీలో అమిత్ షా రాసిన ఈ వ్యాసంలో… గిరిజ‌ను అభ్యున్న‌తి కోసం బీజేపీ నేతృత్వంలోని అట‌ల్ బిహారీ వాజ్‌పేయితో పాటు ప్ర‌స్తుత భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తీసుకున్న చ‌ర్య‌ల‌ను అమిత్ షా ప్రస్తావించారు.
భార‌త రాష్ట్రప‌తిగా ద్రౌప‌ది ముర్ము సోమ‌వారం ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన సంగ‌తి తెలిసిందే. పార్ల‌మెంటులో అట్ట‌హాసంగా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని గుర్తు చేస్తూ అమిత్ షా ఈ వ్యాసాన్ని రాసిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాసానికి తాను ముర్మును అభినందిస్తున్న ఫొటోను కూడా అమిత్ షా వాడుకున్నారు. ఈనాడు ఎడిటోరియ‌ల్ పేజీలో అమిత్ షా రాసిన వ్యాసాన్ని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.ల‌క్ష్మ‌ణ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Nationalist Voice

About Author

error: Content is protected !!