రేవంత్ రెడ్డిని రియ‌ల్ టైగ‌ర్‌గా అభివ‌ర్ణించిన‌ రాంగోపాల్ వ‌ర్మ‌

  • ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వ‌ర్మ‌
  • వైర‌ల్‌గా మారిన ఫొటో

 

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డితో క‌లిసి ఉన్న ఓ ఫొటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల‌చేసిన సంద‌ర్భంగా రాంగోపాల్ వ‌ర్మ ఈ వ్యాఖ్య‌లు చేశారు. రేవంత్ రెడ్డిని రియ‌ల్ టైగ‌ర్ ఆఫ్ తెలంగాణ‌గా అభివ‌ర్ణిస్తూ ఆయనను ఆకాశానికెత్తేశారు. రేవంత్ రెడ్డి, వ‌ర్మ క‌లిసి దిగిన స‌ద‌రు ఫొటోతో పాటు ఆ ఫొటోకు వ‌ర్మ త‌గిలించిన క్యాప్ష‌న్ కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!