రేపు 12గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత

సూర్యగ్రహణం సందర్భంగా రేపు (మంగళవారం) 12 గంట‌ల పాటు తిరుమల తిరుపతి శ్రీ‌వారి ఆల‌యం త‌లుపులు మూసివేయటం జరుగుతుందని టీటీడీ తెలిపింది. 25న సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం కారణంగా.. 25న ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచనున్నారు. ఈ సందర్భంగా అన్ని ర‌కాల ప్రత్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేయడం జరిగిందని, కేవలం స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే గ్రహణం తరువాత అనుమ‌తి ఉంటుందని టీటీడీ పేర్కొంది.

లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ రద్దు చేయడంతో పాటు గ్రహణం తొలిగాక ఆలయ శుద్ధి చేసి భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అక్టోబ‌రు 24, 25, నవంబరు 8న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించిన విషయం విధితమే. అక్టోబరు 24న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో దీపావళి ఆస్థానం ఉంది.. ఇటు అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ ద‌ర్శనాలను రద్దు చేశారు.

నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజుకూడా సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో గ్రహణాల రోజుల్లో బ్రేక్‌, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. అదేవిధంగా గ్రహణాల సమయంలో అన్నప్రసాద పంపిణీసైతం నిలిపివేయనున్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!