రేపు అమావాస్య, సూర్యగ్రహణం… హైదరాబాదులో యువకుడి నరబలి…?

  • కేపీహెచ్ బీ హైదర్ నగర్ లో క్షుద్రపూజల కలకలం
  • శ్మశాన వాటిక వద్ద కాలిన స్థితిలో మృతదేహం
  • పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు
టెక్నాలజీ ఫలాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతున్న నేటి కాలంలో నగరాల్లో క్షుద్రపూజల వంటి అనాగరిక ఆచారాలు కొనసాగుతుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తాజాగా, హైదరాబాద్ కేపీహెచ్ బీ లో క్షుద్రపూజల కలకలం రేగింది.

ఇక్కడి హైదర్ నగర్ లో ఓ యువకుడి మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది. స్థానికులు శ్మశాన వాటిక వద్ద ఈ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, మృతదేహం పడివున్న ప్రదేశానికి దగ్గర్లో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు కనిపించడంతో ఇది నరబలి అయ్యుంటుందని భావిస్తున్నారు.

రేపు (అక్టోబరు 25) అమావాస్య కావడం, అదే రోజున సూర్యగ్రహణం సంభవిస్తుండడంతో యువకుడిని బలి ఇచ్చి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన ఆ యువకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.

Nationalist Voice

About Author

error: Content is protected !!