రేప‌టి కీల‌క స‌మావేశానికి ముందు శ‌ర‌ద్ ప‌వార్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భేటీ

Mamata Banerjee met NCP chief Sharad Pawarనేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో విప‌క్షాల ఉమ్మడి అభ్య‌ర్థిని నిలిపే దిశ‌గా వ్యూహాలు ర‌చిస్తున్న దీదీ… బుధ‌వారం ఢిల్లీలో ప‌లు పార్టీల‌తో కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ భేటీకి రావాలంటూ ఆమె ఇప్ప‌టికే వివిధ పార్టీల‌కు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేత‌ల‌కు ఆహ్వానాలు పంపారు. దీదీ నిర్వ‌హించే భేటీలో పాలుపంచుకునే నిమిత్తం శ‌ర‌ద్ ప‌వార్ మంగ‌ళ‌వార‌మే ఢిల్లీ చేరుకున్నారు. 
శ‌ర‌ద్ ప‌వార్ కంటే ముందే ఢిల్లీ చేరుకున్న మ‌మ‌తా బెన‌ర్జీ… కాసే.ప‌టి క్రితం ఆయ‌న‌తో భేటీ అయ్యారు. శ‌ర‌ద్ ప‌వార్ ఇంటిలో జ‌రిగిన ఈ స‌మావేశంలో రేప‌టి స‌మావేశంలో చ‌ర్చించాల్సిన అంశాలు, భేటీకి హాజర‌య్యే పార్టీల వైఖ‌రి త‌దిత‌రాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే…విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో నిలిచే అంశంపై ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చిన శ‌ర‌ద్ ప‌వార్‌ను మ‌మ‌తా బెన‌ర్జీ స్వ‌యంగా క‌ల‌వడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!