రెండో పెళ్లి ఇంకా చేసుకోలేదు… త్వరలోనే చేసుకుంటా: సినీ నటుడు పృధ్వీరాజ్

  • తొలి భార్య బీనాతో ఆరేళ్లుగా విడిగా ఉంటున్న పృధ్వీ
  • 24 ఏళ్ల షీతల్ తో రిలేషన్ లో ఉన్నానని చెప్పిన నటుడు
  • రెండో పెళ్లి చేసుకున్నానన్న వార్తలు అవాస్తవమని వెల్లడి
  •  పృధ్వీతో పెళ్లికి తమ ఇంటి వాళ్లు ఒప్పుకున్నారన్న షీతల్
 తాను ఇప్పటికే రెండో పెళ్లి చేసుకున్నానంటూ వస్తున్న వార్తలపై టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ తాజాగా స్పందించారు. తాను రెండో పెళ్లి ఇంకా చేసుకోలేదని, త్వరలోనే చేసుకుంటానని వెల్లడించారు. ప్రస్తుతం తాను షీతల్ అనే ఓ 24 ఏళ్ల యువతితో రిలేషన్ లో ఉన్నానని చెప్పిన పృధ్వీ… ఆమెనే పెళ్లి చేసుకుంటానేమోనని వ్యాఖ్యానించారు. షీతల్ తో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీనా అనే మహిళను గతంలోనే వివాహం చేసుకున్న పృధ్వీ గడచిన ఆరేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించిన పృధ్వీ… దీనిపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ తనపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, తన తొలి భార్య బీనాతో అభిప్రాయ భేదాలతో ఆరేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నానని తెలిపారు. ఒంటరి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందన్న విషయం క్రమంగా తెలిసి వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే షీతల్ తో పరిచయం జరిగిందన్నారు.

షీతల్ తో జరిగిన పరిచయం స్నేహంగా మారిందనిపృధ్వీ చెప్పారు. ప్రస్తుతం తామిద్దరం రిలేషన్ లో ఉన్నామని, షీతల్ వయసు 24 ఏళ్లని, తన వయసేమో 57 ఏళ్లని కూడా ఆయన చెప్పారు. తామిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని తెలిపారు. ఇకపృధ్వీతో పాటే ఇంటర్వ్యూలో పాల్గొన్న షీతల్ తమ రిలేషన్ ను ధ్రువీకరించింది. పృధ్వీ తమ ఇంటిలో వాళ్లందరికీ తెలుసునని, తమ పెళ్లికి వారు కూడా ఒప్పుకున్నారని తెలిపింది. వయసు ఓ నెంబర్ మాత్రమేనని షీతల్ వ్యాఖ్యానించింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!