రూ.61.71 కోట్లు మోసం.. రైస్‌ మిల్లుపై సీబీఐ కేసు

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని రాజా రాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్ మిల్లు యజమానులుపై కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు.. హైదరాబాద్‌ సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు రూ. 62 కోట్లు (రూ.61.71 కోట్లు) రుణం తీసుకుని ఎగవేసినట్టు అభియోగాలు మోపారు.. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది సీబీఐ.. రైస్‌ మిల్లు యజమానులైన కందా ప్రసన్న కుమార్ రెడ్డి, కందా ప్రతిమ, కందా పద్మనాభ రెడ్డిలపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.. ఇక, నెల్లూరులోని రెండు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు.. 2017-18లో బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైస్‌ మిల్లు యాజమాన్యం.. ఆ మొత్తాన్ని చెల్లించకుండా మోసగించినట్లు సీబీఐ ఫిర్యాదు అందింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!