రాహుల్ పై విమర్శలు చేసిన కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

  • కేసీఆర్ జాతీయ పార్టీపై నిన్న రాహుల్ విమర్శలు
  • సొంత నియోజకవర్గంలోనే రాహుల్ గెలవలేకపోయారన్న కేటీఆర్
  • ‘డ్రామారావు’ అనే హ్యాష్ ట్యాగ్ తో స్పందించిన రేవంత్
సొంత నియోజకవర్గం అమేథిలో గెలవలేకపోయిన రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ ఆశయాలను అపహాస్యం చేస్తున్నారంటూ కేటీఆర్ విమర్శించడం తెలిసిందే. రాహుల్ గాంధీ ముందు తన సొంత నియోజకవర్గంలో ప్రజలను మెప్పించడం నేర్చుకోవాలని హితవు పలికారు. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

మీరు డబ్బా కొట్టుకుంటున్న ‘జాతీయ’ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైందన్న సంగతి గుర్తుందా…? అని ప్రశ్నించారు. కన్నకూతురినే ఎంపీగా గెలిపించుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. ఎవరన్నా గుర్తు చేయండ్రా బాబూ… అంటూ రేవంత్ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు. ‘డ్రామారావు’ అనే హ్యాష్ ట్యాగ్ తో కేటీఆర్ ట్వీట్ పై ఈ మేరకు స్పందించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!