రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న సీనియర్ నటి పూజాభట్

  • యువ నేతతో కలిసి కొద్ది దూరం నడిచిన నటి
  • సెలబ్రిటీలను భాగం చేయడం ద్వారా యాత్రకు ప్రజాదరణ
  • వ్యూహాల అమలులో చురుగ్గా కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ కు మద్దతుదారులైన సెలబ్రిటీలను ఇందులో భాగంగా చేస్తోంది. తద్వారా రాహుల్ పాదయాత్రకు మరింత ప్రజాదరణ తీసుకురావచ్చన్న వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే నటి పూనమ్ కౌర్ రాహుల్ తో కలసి తెలంగాణలో కొద్దిదూరం నడిచింది.

బుధవారం ఉదయం హైదరాబాద్ నగర పరిధిలో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రలోకి బాలీవుడ్ సీనియర్ నటి పూజా భట్ కూడా చేరిపోయింది. రాహుల్ తో కలిసి ఆమె కొద్ది దూరం నడిచింది. ‘‘ప్రతి రోజూ కొత్త చరిత్ర లిఖితమవుతోంది. రోజురోజుకీ దేశంలో ప్రజల ప్రేమ పెరిగిపోతోంది’’అంటూ కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ఫొటోలు, వీడియోలను తన సామాజిక మాధ్యమాల్లో పబ్లిష్ చేసింది. రాహుల్ యాత్రకు ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు మద్దతుగా ప్రకటనలు చేయడం గమనించాలి.

Nationalist Voice

About Author

error: Content is protected !!