రాహుల్ గాంధీతో సినీ నటి పూనం కౌర్

  • తెలంగాణలో నాలుగో రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
  • రాహుల్ ను కలిసి సంఘీభావాన్ని ప్రకటించిన పూనం కౌర్
  • రాహుల్ తో కలిసి నడిచిన సినీనటి
భారత్ జోడో యాత్ర పేరుతో కన్నియాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా ధర్మపురిలో ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభమయింది.

ఈ సందర్భంగా సినీ నటి పూనం కౌర్ రాహుల్ గాంధీని కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు. ఉస్మానియా విద్యార్థులతో పాటు ఆమె రాహుల్ ను కలిశారు. రాహుల్ తో కలిసి నడిచారు. రాహుల్ తో నడుస్తూ, ఆయనతో పూనం మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ఈరోజుతో నాలుగో రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన 20 కిలోమీటర్లు నడవనున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం జడ్చెర్లలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నిన్న రాత్రి ఆయన ధర్మాపూర్ లో బస చేశారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!