రానా తండ్రి కాబోతున్నాడంటూ ప్రచారం.. వాస్తవం ఇదే!

  • ఇటీవల కాస్త బొద్దుగా తయారైన రానా భార్య మిహీకా
  • ఆమె గర్భవతి అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం
  • తాను గర్భవతి కాదని క్లారిటీ ఇచ్చిన మిహీకా
ప్రముఖ సినీ నటుడు రానా తండ్రి కాబోతున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రానా భార్య మిహీకా బజాజ్ ప్రస్తుతం గర్భవతి అని సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో మిహీకా కాస్త బొద్దుగా తయారు కావడంతో.. ఆమె గర్భవతి అయిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలో నిజం లేదని తేలిపోయింది. తాను గర్భవతిని అంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారాలేనని మిహీకా తెలిపింది. తాను ప్రెగ్నెంట్ కాదని ఆమె స్పష్టం చేశారు.

మీరు ప్రెగ్నెంటా? అని సోషల్ మీడియాలో మిహీకాను ఆమె ఫాలోయర్ ఒకరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ… తాను సంతోషకరమైన వైవాహిక బంధంలో ఉన్నానని… అందుకే ఈ మధ్య మరింత ఆరోగ్యవంతంగా తయారయ్యానని చెప్పారు. దీంతో, రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే ప్రచారానికి ముగింపు పలికినట్టయింది. 2020 ఆగస్ట్ 8న వీరు పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో కరోనా సమయం కావడంతో వీరి వివాహానికి అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Nationalist Voice

About Author

error: Content is protected !!