రజనీ 166వ సినిమా రిలీజ్ అప్పుడేనట!

  • 166వ సినిమాపై రజనీ దృష్టి
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్ట్
  • నెల్సన్  పై తగ్గని రజనీ నమ్మకం
  • వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్

రజనీకాంత్ ఈ మధ్య కాలంలో వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తూ వెళుతున్నారు. ఒకప్పుడు ఆయనతో సినిమా చేయాలంటే కొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఆయన విషయం ఉందనుకుంటే చాలు, యువ దర్శకులకు ఛాన్స్ ఇచ్చేస్తున్నారు. తనని తాను మరింత కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.

అలా ఆయన ఇంతవరకూ మూడు సినిమాలు మాత్రమే చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ కి ఛాన్స్ ఇచ్చారు. విజయ్ తో ఆయన చేసిన ‘బీస్ట్’ సినిమా సరిగ్గా ఆడకపోయినా, రజనీ మాత్రం వెనక్కి తగ్గలేదు. సన్ పిక్చర్స్ వారి బ్యానర్లో ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతోంది. ‘బీస్ట్’ విషయంలో జరిగిన స్క్రీన్ ప్లే లోపం ఈ సినిమా విషయంలో జరగకుండా నెల్సన్ జాగ్రత్త పడుతున్నాడు.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా అదే రోజున విడుదల కానుంది. ఈసారి సంక్రాంతికి ఇక్కడ కూడా గట్టిపోటీనే ఉండనుంది. అయినా రజనీ వెనక్కి తగ్గే అవకాశాలైతే కనిపించడం లేదు.

Nationalist Voice

About Author

error: Content is protected !!