యూపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న బీజేపీ నేత

 

నేషనలిస్ట్ వాయిస్, మే 19. న్యూడిల్లీ :  తెలంగాణలోని ఓ బీజేపీ నేతకు.. రాజ్యసభ బెర్త్ కన్‌ఫార్మ్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఆ నాయకుడి వెళ్లేది.. మరో స్టేట్ కోటాలో. ఇక్కడ.. టీఆర్ఎస్‌పై కాషాయ నేతలు చేస్తున్న పోరాటానికి.. జాతీయ నాయకత్వం కాస్త అధికార బలాన్ని అందించే ఆలోచనలో ఉందా? లేక.. పార్టీలో ఉన్న గ్రూప్ పాలిటిక్స్‌ని తగ్గించేందుకే.. ఆయన్ని సెలక్ట్ చేశారా? అన్నది.. ఇంట్రస్టింగ్‌గా మారింది. ఏదేమైనా.. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన.. నేతకు.. మళ్లీ వైభవం రాబోతోందని బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అమిత్ షా టూర్ తర్వాత.. తెలంగాణ బీజేపీలో పరిణామాలు, రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో.. అధికారం దక్కించుకోవాలంటే.. మరింత పోరాడాలని జాతీయ నాయకత్వం భావిస్తోందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు చేస్తున్న పోరాటానికి.. వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న జాతీయ నాయకత్వం.. ఇక్కడి నాయకులకు కొంత అధికార బలాన్ని కూడా అందించాలన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇందుకోసం.. రాష్ట్రం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నేతను.. రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని.. పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. రాజ్యసభకు పంపాల్సి వస్తే.. ఎవరిని పంపుతారు? ఏ స్టేట్.. కోటాలో పంపుతారని.. పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపేందుకు.. ఓ నాయకుడిని ఎంపిక చేయాల్సి వస్తే.. గతంలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తినే.. సెలక్ట్ చేసే చాన్స్ ఉందని.. పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో.. మురళీధర్ రావును రాజ్యసభకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. పార్టీ నాయకుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మురళీధర్ రావు గతంలో.. ఆయన కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, జమ్మూకశ్మీర్‌లో.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దాంతో పాటు.. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోయాయని వార్తలు వస్తున్న టైంలో.. ముందుగానే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఇందుకోసం.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న మురళీధర్ రావుకు.. రాష్ట్ర నేతలను సమన్వయం చేసే బాధ్యతలు అప్పజెప్పినట్లుగా.. కాషాయ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగుతోంది. పార్టీ బలోపేతానికి వ్యూహాలు రచించడంతో పాటు నేతలను సమన్వయం చేయడంలో దిట్ట అయిన మురళీధర్ రావును.. రాజ్యసభకు పంపే ఆలోచనలో.. అధిష్టానం ఉన్నట్లుగా.. ఆయన సన్నిహిత వర్గాలు చర్చించుకుంటున్నాయ్. యూపీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంది. త్వరలోనే.. అక్కడి నుంచి ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో.. ఒకదానిని మురళీధర్ రావుతో భర్తీ చేసే అవకాశం ఉందని.. పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం.. తెలంగాణ బీజేపీలో మొదలైన విభేదాలు, వర్గ పోరును తగ్గించే పనిలో మురళీధర్ రావు ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి నేతలతో.. ఆయనకున్న పరిచయాలతో.. రాష్ట్ర స్థాయి నేతలను.. బుజ్జగిస్తున్నారని.. దానికి అధికార బలం కూడా తోడైతే.. భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ రాకుండా చూసుకుంటారని.. హైకమాండ్ భావిస్తోంది.తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ.. ఇప్పుడు మురళీధర్ రావుకు రాజ్యసభ పదవి కట్టబెడితే.. భవిష్యత్తులో కేంద్రమంత్రిని కూడా చేసే అవకాశం కూడా ఉందంటూ ప్రచారం సాగుతోంది.

Nationalist Voice

About Author

error: Content is protected !!