‘యశోద’ షూటింగ్ పూర్తయిన తర్వాతే సమంత ఆరోగ్యం క్షీణించినట్టుంది: వరలక్ష్మీ శరత్ కుమార్

  • మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత
  • ‘యశోద’ షూటింగ్ లో సమంత చాలా యాక్టివ్ గా ఉండేదన్న వరలక్ష్మి
  • సమంత త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్ష
హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోందనే వార్తతో అందరూ షాక్ కు గురయ్యారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరోవైపు ఈ విషయంపై సినీ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందిస్తూ… సమంతతో తనకు 12 ఏళ్లుగా పరిచయం ఉందని… తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది. ‘యశోద’ సినిమాలో సమంతతో కలిసి నటించడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపింది.

సెట్స్ లో ఇద్దరం చాలా సరదాగా ఉండేవాళ్లమని వరలక్ష్మి చెప్పింది. సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతోందనే విషయం షూటింగ్ రోజుల్లో తమకు తెలియదని వెల్లడించింది. ఆమె ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉండేదని చెప్పింది. ‘యశోద’ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే ఆమె ఆరోగ్యం క్షీణించిందని భావిస్తున్నానని తెలిపింది. సమంత ఒక ఫైటర్ అని… త్వరలోనే ఆమె కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

తన సినిమాల గురించి మాట్లాడుతూ బాలకృష్ణ చిత్రం ‘వీర సింహారెడ్డి’లో కీలక పాత్రను పోషిస్తున్నానని చెప్పింది. ఈ సినిమా కోసం 15 కిలోల బరువు తగ్గానని తెలిపింది. తమిళంలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయని చెప్పింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!