మోదీ సర్కారుపై కేటీఆర్ చార్జ్ షీట్

  • తెలంగాణ యువతకు కేంద్రం ద్రోహం చేసింది
  • 2 కోట్ల ఉద్యోగాలంటూ హామీ ఇచ్చి మోదీ మోసం చేశారు
  • విభజన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని మండిపడ్డ మంత్రి
  • సంక్షేమ పథకాలను ఉచితాలంటూ హేళన చేస్తున్నారని విమర్శ
  • తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూ కేంద్రం తీరుతో తీరని అన్యాయం
తెలంగాణతో పాటు దేశ యువతకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ద్రోహం చేసిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పటికీ లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈమేరకు శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. కేంద్రంలోని మోదీ సర్కారుపై చార్జ్ షీట్ పెడుతున్నామని కేటీఆర్ చెప్పారు. నల్గొండలో హ్యాండ్ లూమ్ పార్క్ కడతామంటూ ఇచ్చిన హామీని కేంద్రం మరిచిందని విమర్శించారు. విభజన హామీలను ఇప్పటకి నెరవేర్చకుండా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కు కూడా కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శించారు. కృష్ణా జలాల పంపకాలలో నిక‌ృష్టమైన రాజకీయం చేస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్స్ చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వంపై చార్జ్ షీట్ పెట్టడానికి కారణాలివే.. కేటీఆర్
నోట్ల రద్దు పేరుతో పనికిమాలిన నిర్ణయం తీసుకుని ప్రజలను ఇబ్బందుల పాలు చేసినందుకు..
కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను అవస్థలపాలు చేసినందుకు..
13 నెలల పాటు ఢిల్లీ రోడ్లపై అన్నదాతలు ఆందోళన చేయడానికి కారణమైనందుకు..
లఖీంపూర్ లో రైతులపైకి వాహనాలు ఎక్కించి చంపించినందుకు..
రూపాయి మారకం విలువ పడిపోవట్లేదు.. డాలర్ బలపడుతోందంటూ తలతిక్క వాదనలు చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వంపై చార్జ్ షీట్ దాఖలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!