మొయినాబాద్‌లో 13 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్‌

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లోలోని చేవెళ్లలో పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝులిపించారు. చేవెళ్లలోని మొయినాబాద్‌లో పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. మొయినాబాద్‌లో ఉన్న ఓ ఫాంహౌస్‌లో పేకాటాడుతుండగా 13 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారయ్యారని అధికారులు తెలిపారు. నిందితుల నుంచి రూ.9 లక్షల 97 వేలు, 15 సెల్‌ఫోన్లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిందులను స్టేషన్‌కు తరలించామని, పరారైవారికోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!