మూసీలో కొట్టుకుపోతున్న వ్య‌క్తిని కాపాడిన ఎస్సై..

హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు ప‌లు ప్రాంతాలు నీట మునిగిన సంగ‌తి తెలిసిందే. కాస్తంత తెరిపి ఇచ్చిన‌ట్టే ఇచ్చిన వ‌ర్షం… తిరిగి సోమ‌వారం రాత్రి న‌గ‌రాన్ని కుమ్మేసింది. ఫ‌లితంగా న‌గ‌ర ప‌రిధిలోని జ‌లాశ‌యాలు, కాల్వ‌లు నిండిపోయాయి. న‌గ‌రం మీదుగా పారుతున్న మూసీ కాలువ అయితే పొంగి పొర‌లుతోంది. ఈ క్ర‌మంలో మూసీ న‌ది నీటిలో ఓ వ్య‌క్తి కొట్టుకుపోతున్న వైనాన్ని గుర్తించిన ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ముందూ వెనుకా చూసుకోకుండా యూనీఫాం మీదే  మూసీలోకి దూకేశారు. కొట్టుకుపోతున్న వ్యక్తిని భుజాన వేసుకుని ఒడ్డుకు చేరారు. వెర‌సి రియ‌ల్ హీరోగా నిలిచారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను తెలంగాణ పోలీసు శాఖ బుధ‌వారం సాయంత్రం త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేసింది. నీటిలో కొట్టుకుపోతున్న వ్య‌క్తిని కాపాడిన ఎస్సై నిజంగానే రియ‌ల్ హీరోనేన‌ని చెప్పిన ఆ శాఖ‌… ఆ ఎస్సై వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించింది. న‌గ‌రంలోని మంగళ్‌హ‌ట్ పోలీస్ స్టేష‌న్‌లో ఎస్సైగా ప‌నిచేస్తున్న రాంబాబు వ్య‌క్తి ప్రాణాలు కాపాడార‌ని వివ‌రించింది.

Nationalist Voice

About Author

error: Content is protected !!