మూడు పార్టీలు ! త్రిముఖ వ్యూహం !!

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల హీట్  కనిపిస్తోంది. ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సై అంటే సై అంటున్నాయి.. అయితే ముఖ్యంగా ప్రస్తుతం పొత్తుల చుట్టే రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే తెలుగు దేశం, జనసేన పార్టీలు కలిసిన నడవడం పక్కా అంటూ సంకేతాలు అందుతున్నాయి.. మరి అది మూడు ముక్కల ఆటగా మారుతుందా లేదా.? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ త్వరలో అద్బుతం జరుగుతుంది అంటూ ఓ హింట్ ఇచ్చారు.. అంటే తమ మూడు పార్టీలు కలబోతున్నాయి అన్నదేనా ఆయన మాటలకు అర్థం.. త్రిముఖ వ్యూహంతో ఆ మూడు పార్టీలు ముందుకు వెళ్తున్నాయా..? అదే జరిగితే అధికార పార్టీ ఎత్తులు ఏంటి… !

పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. అధికార పార్టీ మాత్రం ప్రస్తుతం జనం బాట పట్టింది. నాయ‌కుల‌ను ప్ర‌తి గ‌డ‌ప‌కు పంపిస్తోంది అధిష్టానం.. ప్ర‌తిప‌క్ష పార్టీ కూడా అదే స్థాయిలో వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు వేస్తోంది. అన్ని అనుకూలిస్తే వ‌చ్చే ఏడాదిలోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌డంతో ఇప్పుడు అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు జోరు పెంచాయి. దీంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయి ఏ పార్టీలు ఒంట‌రిగా బరిలో దిగుతాయానే చ‌ర్చ జోరుగా సాగుతుంది.  తాజ‌గా ప్ర‌తిప‌క్ష పార్టీ నేత చంద్ర‌బాబుతోపాటు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తోన్న వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీలో పోలిటిక‌ల్ వాతావ‌ర‌ణాన్ని మ‌రింత వేడెక్కిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌పార్టీ మ‌ళ్లీ గెల‌వ‌కుండా వ్య‌తిరేక ఓటు చీల్చ‌కుండా ఏ అన్ని పార్టీల‌ను ఏకం చేస్తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డం.. అధికాపార్టీ నేత‌ల‌ను ఆందోళ‌న‌కు గురిస్తోన్న అంశం. ఇదే అంశంలో బాబు కూడా అదే అభిప్రాయంతో ఉండ‌డంతో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేనా, టీడీపీ క‌లిసే పోటీ చేస్తాయ‌నేది దాదాపు ఖరారైంద‌ని అంటున్నారు ఇరుపార్టీ నేత‌లు. ఏపీ బిజేపీ ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటుంద‌నే దానిపై స‌ర్వ‌త్ర  ఉత్కంఠ నెల‌కుంది. ఇప్పుటికే ప‌వ‌న్ బిజేపీతో ఉన్న‌ప్ప‌టికి రాష్ట్ర బిజేపీ నేత‌ల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య దూరం మొద‌టి నుంచి అలానే ఉంది.

ప‌వ‌న్ ఎప్పుడూ కేంద్రంలో ఉన్న బీజేపీ నేత‌ల‌తోనే ఎక్క‌వ చ‌ర్చ‌లు అక్క‌డ నుంచి వ‌చ్చిన డైరెక్ష‌న్స్ అనుగుణంగానే అడుగులు వేస్తూ వ‌స్తోన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర బిజేపీ నేత‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోత్తుల గురించి ఇప్పుడు కాస్త క‌ఫ్యూజ్ గా మాట్లాడిన కేంద్రంలో ఉన్న నేత‌ల చెప్పిందే ఇక్క‌డ బీజేపీ నేత‌లు చేయాల‌నే అభిప్రాయంలో ప‌వ‌న్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌స‌ర‌మైన జ‌న‌సేనా, టీడీపీ కూట‌మీతో బిజేపి క‌లిపే ప్ర‌య‌త్నం తాను తీసుకోవ‌డానికి కూడా ప‌వ‌న్ సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాల స‌మాచారం. వ‌చ్చే వారం ప‌వ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఉందని జనసేన వర్గాల టాక్. రాష్ట్రంలో జ‌రుగుతున్న అంశాల‌పై కేంద్రానికి ఒక ప్ర‌జెన్టేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి క‌ట్లుగా ఉండ‌డం ఎంత అవ‌స‌ర‌మ‌నేది కేంద్రానికి ప‌వ‌న్ వివ‌రించ‌బోతున్న‌ట్లు జనసేన వర్గాల నుంచి అందుతున్న అప్ డేట్. ఇదే క‌నుక జ‌రిగితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో 2014 నాటి పోత్త‌లు మ‌ళ్లీ ఉండ‌బోతున్నాయ‌ని అభిప్రాప‌డుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇప్ప‌టికే అధికార పార్టీలోనే ఉంటూ త‌న సొంత‌పార్టీ పైనే ప్ర‌తిప‌క్ష పార్టీల కంటే ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు చేస్తోన్న ఎంపీ ర‌ఘురామ‌కృష్టంరాజు ఈ పొత్తులో నే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోతున్న‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. టీడీపీ, జ‌న‌సేనా, బిజేపీ పొత్తులో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజేపీ పార్టీనుంచి టీడీపీ, జ‌న‌సేనా మ‌ద్ద‌తుతో ఆయ‌న బ‌రిలో దిగ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. మొన్న‌నే పుట్టిన రోజు జ‌రుపుకున్న సంద‌ర్భంలో ఆయ‌న్ని క‌లిసి త‌న అబిమానుల‌తో ఆయ‌న ఈ విష‌యాన్ని ఆఫ్ ద రికార్డ్ వెల్లడించిన‌ట్లు విశ్వ‌స‌నీయవ‌ర్గాల స‌మాచారం.

Nationalist Voice

About Author

error: Content is protected !!