మునుగోడులో పట్టుబడ్డ నగదు కోటిన్నర పైనే: ఈసీ

  • ఓటర్లను ప్రలోభానికి గురిచెయ్యకుండా అడ్డుకుంటున్నాం
  • నియోజకవర్గంలో 2.4 లక్షల ఓటర్లు
  • ఓటరు లిస్టులో పేర్లు గల్లంతైన వారి ఆఫీసుకు వస్తున్నారు..
  • రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ వెల్లడి
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నగదు పంపిణీ జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ పేర్కొన్నారు. ఉపఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న రోహిత్ సింగ్.. సోమవారం విలేకరులతో మాట్లాడారు. డబ్బులు తరలించకుండా ఎక్కడికక్కడ పోలీసులతో తనిఖీలు జరిపిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు తనిఖీలలో సుమారు కోటిన్నరకు పైగా నగదు పట్టుబడిందని తెలిపారు. రూ.1,48,44,160 ల నగదును సీజ్ చేసినట్లు వివరించారు. ఈ తనిఖీలలో భాగంగా ఇప్పటి వరకు దాదాపు రూ.లక్ష విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు రోహిత్ సింగ్ తెలిపారు.

మునుగోడులో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారని ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి రోహిత్ సింగ్ చెప్పారు. ఓటర్ జాబితాలో పేర్లు గల్లంతైన వారు రోజూ తమ ఆఫీసుకు వస్తున్నారని ఆయన వివరించారు. వాళ్ల నుంచి వివరాలు సేకరించి, పరిశీలిస్తున్నామని వివరించారు. ఉప ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నియమనిబంధనలు అన్నింటినీ పాటిస్తున్నామని చెప్పారు. ఈవీఎం మెషిన్లతో ఇటీవల నిర్వహించిన మాక్ పోల్ సాఫీగా జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రోహిత్ సింగ్ వివరించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!