ముందు తమరు అందుకున్న 50 లక్షల ‘మెఘా’ పారితోషికం గురించి వివరణ ఇవ్వండి అంటూ రజత్ కుమార్​కు ప్రవీణ్​ కుమార్​ ట్వీట్​

భారీ వర్షం, వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంజ్ హౌజ్లు నీట మునగడం రూ. వందల కోట్ల నష్టం వాటిల్లిందని వస్తున్న వాస్తవం లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్అన్నారు. పంప్ హౌజ్ల మునక వల్ల కేవలం రూ. 20  కోట్ల నుంచి 25 కోట్ల వరకు నష్టం కలిగిందని ప్రకటించారు.
దీనిపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ప్రాజెక్టును అంత నష్టం వాటిల్లనప్పుడు  పంపుల దగ్గరికి పోకుండా తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం డిజైన్, అంచనాలను బహిర్గతం చేయాలని ట్వీట్ చేశారు.
‘రజత్ గారు, కాళేశ్వరం పంపుల మునక గురించి మాట్లాడే ముందు తమరు అందుకున్న రూ. 50 లక్షల ‘మెఘా’ పారితోషికం గురించి వివరణ ఇవ్వండి. ఏం జరగనప్పుడు మమ్మల్నెందుకు పంపుల దగ్గరికి పోకుండా అరెస్టు చేస్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, అంచనాలను ప్రజలకు చూపించే దమ్ముందా? ’అని ప్రవీణ్ కుమార్ ట్విటర్ లో ప్రశ్నించారు. 
Nationalist Voice

About Author

error: Content is protected !!