మిన్పూర్ లో రైతుల రాస్తారోకో

నేషనలిస్ట్ వాయిస్, మే 19, పాపన్నపేట :  మెదక్ జిల్లా పాపన్నపేట మండలం   మిన్పూర్ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ లారీలు రాక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ ఆ గ్రామ రైతులు మెదక్  బొద్మట్ పల్లి రహదారిపై గురువారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. విషయం తెలుసుకున్న పాపన్నపేట తాసిల్దార్ లక్ష్మణ్ ,ఎస్ ఐ విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని  రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి లింగారెడ్డి, టిఆర్ఎస్ మైనారిటీ సెల్ నాయకులు బాబర్ పటేల్, ఎంపిటిసి కుబేరుడు, మాజీ ఎంపిటిసి గోపాల్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో  స్థానిక రైతులు పాల్గొన్నారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!