మా కుటుంబంలో ఒకరిని అంతం చేయడానికి ఆనాడు కుట్రలు చేశారు: చంద్రబాబుపై తోపుదుర్తి ఆరోపణలు

  • చంద్రబాబు జనాలను రెచ్చగొడుతున్నారు
  • అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు సైన్యాలతో దాడులు చేయించారు
  • ఏపీని చంద్రబాబు దివాళా తీయించారని కాగ్ స్పష్టం చేసింది
టీడీపీ అధినేత చంద్రబాబుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను రెచ్చగొడుతున్నారని, జనాలను వర్గాలుగా విడగొట్టి ఓట్లను పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాగైనా గెలవాలి… పోరాడండి అంటూ పార్టీ శ్రేణులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు సైన్యాలతో దాడులు చేయించారని, తన కటుంబ సభ్యుల్లో ఒకరిని అంతం చేయడానికి కుట్రలు చేశారని ఆరోపించారు.

రక్తం పారించిన చరిత్ర వైసీపీదైతే… నీరు పారించిన చరిత్ర వైసీపీదని అన్నారు. దశాబ్దాల పాటు రక్తం పారిన ప్రాంతంలో తాము నీళ్లు ప్రవహించేలా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని చంద్రబాబు దివాళా తీయించారని కాగ్ నివేదిక కూడా స్పష్టం చేసిందని తెలిపారు. చంద్రబాబును ఆర్థిక ఉన్మాది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!