మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత

అమరావతి : ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ జనసేన చేపట్టిన డిజిటల్‌ క్యాంపెయిన్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద జనసేన కార్యకర్తలు నిర్వహించిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది . పట్టణంలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన నిర్వహించడంతో పోలీసులు వారినిఅడ్డుకున్నారు.విజయవాడలో జనసేన నాయకుడు మహేశ్‌ ఆధ్వర్యంలో రోడ్లపై గుంతల్లో మొక్కలు నాటి నిరసన తెలిపారు. గుంటూరు, అన్నమయ్య జిల్లాలో నిరసన తెలిపారు. జులై లోగా రోడ్లను బాగు చేస్తామని ఏపీ సీఎం జగన్‌ ప్రగల్భాలు పలికారని ఆరోపించారు. అప్పుగా తీసుకొచ్చిన నిధులను రోడ్లకు ఉపయోగించినట్లయితే ప్రస్తుత సమస్య ఉండేది కాదని అన్నారు. సీఎంకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రాష్ట్రం అధోగతి పాలవుతుందని విమర్శించారు.

Nationalist Voice

About Author

error: Content is protected !!